హైదరాబాద్ సిటీ, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మూడో రోజైన సోమవారం ఊపందుకుంది. అధికారులు 88,516 కుటుంబాల వివరాలు సేకరించారు. సరిపడా అప్లికేషన్ ఫామ్స్ లేక మొదటి రెండు రోజులు సర్వే నెమ్మదిగా సాగింది. ఉన్నతాధికారులు ఇబ్బందులను తొలగించడంతో మూడో రోజు సర్వే వేగంగా సాగింది. మొత్తంగా మూడు రోజుల్లో 1,71,052 కుటుంబాల సర్వే పూర్తయింది. మొదటిరోజు 12,912, రెండో రోజు 69,624, మూడో రోజు 88,516 కుటుంబాల సర్వే జరిగింది. అలాగే సర్వేను మరింత సమర్థంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లకు10 మంది నోడల్ ఆఫీసర్లను నియమించింది.
సర్కిళ్ల వారీగా నోడల్ ఆఫీసర్లు..
1. అడిషనల్ కమిషనర్ ఎస్.సరోజ(కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్), 2. అడిషనల్ కమిషనర్ ఎస్.పంకజ(హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్)3. అడిషనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్(సంతోష్‌నగర్,చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా) 4. ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్ రెడ్డి(మలక్ పేట, చార్మినార్, రాజేంద్రనగర్)5. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ శరత్ చంద్ర(మెహిదీపట్నం, కార్వాన్, జూబ్లీహిల్స్), 6. కె.సత్యనారాయణ లీగల్, ఎలక్ట్రిసిటీ అడిషనల్ కమిషనర్(గోషామహల్, ముషీరాబాద్, అంబర్ పేట),7. చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ వెంకటరెడ్డి(యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందానగర్), 8. అడిషనల్కమిషనర్(అడ్వర్‌టైజ్‌మెంట్స్) వేణుగోపాల్ రెడ్డి(పటాన్ చెరు, మూసాపేట, కూకట్‌పల్లి), 9. అడిషనల్ కమిషనర్ శానిటేషన్ సీఎన్ రఘు ప్రసాద్(కుత్బుల్లాపూర్, గాజులరామారం),10. అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ ఎన్ యాదగిరి రావు(అల్వాల్, బేగంపేట, కంటోన్మెంట్, ఉప్పల్).
రంగారెడ్డి జిల్లాలో లక్ష కుటుంబాలుఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మొదటి మూడు రోజుల్లో లక్షా 202 కుటుంబాల సర్వే పూర్తిచేసినట్లు కలెక్టర్సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు అనధికారికంగా సర్వేకు గైర్హాజరు అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ద్వారా సర్వేపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలన్నారు. అడిషనల్కలెక్టర్ ప్రతీమా సింగ్, జిల్లా ప్లానింగ్ఆఫీసర్పి.సౌమ్య తదితరులు పాల్గొన్నారు.