GHMC పాలకమండలి సమావేశం రసాబాసగా సాగుతోంది. GHMC కౌన్సిల్లోకి మీడియాను అనుమతించకపోవడంపై బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన చేశారు. మీడియాను ఎందుకు అమనమతించడం లేదంటూ ప్రశ్నించారు. మీడియాను అనుమతీంచాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దీంతో 5నిమిషాల పాటు సభని వాయిదా వేశారు మేయర్ విజయ లక్ష్మి.
దీంతో మేయర్ చాంబర్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు జర్నలిస్టులు. మీడియాని ఎందుకు అనుమతించడం లేదో మేయర్, కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు మీడియా ప్రతినిధులు. దీంతో కౌన్సిల్ లో గందరగోళ వాతావరణం ఏర్పడింది.