బిల్లుల ఆమోదంపై కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

బిల్లుల ఆమోదంపై  కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

నందిపేట, వెలుగు : ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో మూడు బిల్లులు ఆమోదం పొందడంపై బుధవారం నందిపేట, డొంకేశ్వర్​ మండల కేంద్రాల్లో కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బీసీ కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ, రాజీవ్​ యువశక్తి ద్వారా నిరుద్యోగులకు రుణాల వంటి మూడు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయి. ఈ సందర్బంగా అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్​  నందిపేట, డొంకేశ్వర్​ మండలాల అధ్యక్షులు  మంద మహిపాల్​, భూమేస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  .

ఆర్మూర్​లో.. 

ఆర్మూర్ : అసెంబ్లీలో మూడు బిల్లుల ఆమోదంపై ఆర్మూర్​లో   సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు సాయిబాబా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్, ఖాందేశ్ శ్రీనివాస్, మోత్కూరి లింగా గౌడ్, జిమ్మి రవి, అజ్జు,  యూత్​ కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్ విజయ అగర్వాల్, అల్జాపూర్ కిరణ్ కుమార్, శీను తదితరులు పాల్గొన్నారు.