గ్రామాల్లో ప్రజాపాలన సంబురాలు

గ్రామాల్లో ప్రజాపాలన సంబురాలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజ‌కవ‌ర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మావ‌ల మండ‌లం వాఘాపూర్, ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లం పిప్పల్​ధరి, జైన‌థ్ మండ‌లం పిప్పర్​వాడ, బేల మండ‌లం డోప్టాల గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. పేద, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్​ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిర‌మ్మ ఇండ్లు, రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు మంజూరు చేసి మాట నిల‌బెట్టుకుంద‌న్నారు. వాఘాపూర్​లో క‌మ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, భూపెల్లి శ్రీధర్, చంద్రశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.