- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : మేమెంతో మాకంత అన్న బలహీనవర్గాల వాదనతో కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు కలిపింది. రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసినం. బలహీనవర్గాల శాఖ మంత్రిగా, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా దీనికి మద్దతు తెలుపుతున్న. ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనకబడిన తరగతులకు సమన్యాయం, సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల గణన ఉపయోగపడుతుంది.
ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 60 రోజుల్లో ఈ సర్వే పూర్తిచేస్తం. ఆ తరువాతనే లోకల్‌బాడీలకు ఎన్నికలు నిర్వహిస్తం.”అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం క్యాంపు ఆఫీసులో శమీపూజలు చేశారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. “రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో కుల గణన చేస్తామని తీర్మానం చేసినం. ఇందు కోసం జీవో 18 జారీ చేసినం. దీనికి ప్లానింగ్ డిపార్టుమెంటును నోడల్ శాఖగా నియమించినం. దీని ఆధ్వర్యంలో కుల గణన సర్వే మొదలైంది. 60 రోజుల్లో ఈ సర్వే పూర్తి అవుతుంది.”అని అన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.