కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు టాస్ గెలిచి MP అయ్యాడు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు  టాస్ గెలిచి  MP అయ్యాడు

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అధికారపార్టీ అయినా.. ఉన్న ఒక్క రాజ్య సభ సీటు గెలుచుకోలేక పోయింది. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో 68 మంది సభ్యులు ఉన్నారు.  ఒక అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావడానికి 35 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.  కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఉంది. MLAలు అందరూ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అభిషేక్ మను సింఘ్వీకి ఓటు వేయాలని కోరుతూ ఆ పార్టీ విప్ జారీ చేసింది. రాజకీయాలు ఒక్కసారిగా లెక్కతప్పాయి. క్రాస్ ఓటింగ్ అయి మ్యాజిక్ జరిగి BJP అభ్యర్థి విజయం సాధించాడు.

ALSO READ :- కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం : విజయా రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కు ఓటు వేశారు. ఇండిపెండిట్ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల మధ్య టై అయింది. దీంతో  విజేతను తేల్చడానికి కాయిన్ తో టాస్ వేశారు. అంచనాలకు అందకుండా టాస్ గెలిచి బీజేపీ క్యాండిడేట్ హర్ష్ మహాజన్ రాజ్య సభకు  ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే రాజేంద్ర రాణా, సుధీర్ శర్మ, రవి ఠాకూర్, చైతన్య శర్మ, ఇంద్ర దత్ లఖన్‌పాల్, దేవేంద్ర భుట్టో.