సీఎంను ఎదుర్కోలేక తప్పుడు విమర్శలు

సీఎంను ఎదుర్కోలేక తప్పుడు విమర్శలు
  • కేసీఆర్​పై కాంగ్రెస్ నేత అద్దంకి ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్​లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బీజేపీలో కలవడం ఖాయమన్నారు. 

గతంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందమే కేసీఆర్​ను రాజకీయంగా ముంచిందని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కేసీఆర్​ను ముంచబోతుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి సహాకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో  ఒకవేళ ఉపఎన్నికలు వచ్చినా కేసీఆర్ మాత్రం బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్​కు భవిష్యత్తు కేవలం భ్రమేనని అద్దంకి పేర్కొన్నారు.