
- నన్ను ఎవరు తిట్టినా పట్టించుకోను: జానారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఏసు క్రీస్తు చెప్పినట్లు తప్పు చేసిన వాడిని క్షమించే గుణం తనది అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనను ఎవరు తిట్టినా పట్టించుకోనన్నారు. తనపై తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు గాలి మాటలన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమని, పాలన చేసే వారు సలహాలు, సూచనలు అడిగితే ఇస్తానని చెప్పారు.