నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరతాం

నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరతాం

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కాంగ్రెస్ జన్నారం మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. రాత్రి 9 గంటల తర్వాత వాహనాల రాకపోకలను ఫారెస్ట్ ఆఫీసర్లు నిషేధించడం వల్ల జన్నారంతో పాటు కడెం, ఖానాపూర్ మండలాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని అన్నారు. 

ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, మరోసారి కూడా ఆయనతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సయ్యద్ ఇసాక్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దుమ్మల్ల రమేశ్, ఎస్సీసెల్ మండల ప్రెసిడెంట్ ఇందయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బి.రాజన్న, లావణ్య తదితరులు పాల్గొన్నారు.