ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మతో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం ఊర చెరువు వద్ద మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. గన్నేరువరం నుంచి గుండ్లపల్లెకు వెళ్లే మార్గంలో హై లెవెల్ వంతెన ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మను గన్నేరువరం ఊర చెరువు మత్తడి వద్ద వేలాడదీశారు.

లెవెల్ కల్వర్టును- హై లెవెల్ కల్వర్టుగా మార్చి.. డబుల్  రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి.. రసమయి మర్చిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హై లెవెల్ వంతెన లేకపోవడం వల్ల భారీ వర్షాలతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయంటూ నిరసన తెలిపారు.