డిచ్​పల్లి మండలంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

డిచ్​పల్లి మండలంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

డిచ్​పల్లి, వెలుగు :  మండలంలోని నడిపల్లిలో  రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్​ నేతలు బుధవారం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  నిధులను మంజూరు చేశారు.  కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకర్ణ, పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, మహ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.