- నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు, వెలుగు: జాతరలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని కాంగ్రెస్‌నేతలు నీలం మధు, కాట శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం భానూరులో గౌడసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అండూర్ సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారు అందరినీ సుఖసంతోషాలతో చూడాలని కోరుకున్నట్టు తెలిపారు. జాతర నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, శ్రీశైలం, గోపాల్ యాదవ్, శివానందం, గోరేమియ, నారాయణ రెడ్డి, అశోక్, రాములు, నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కృష్ణ గౌడ్, ప్రభు గౌడ్, జితేందర్ గౌడ్, సుధాకర్ గౌడ్, మధు, శివ, మహేశ్ పాల్గొన్నారు.
మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి
మల్లన్న స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతు జాతరలు, ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, నారాయణ రెడ్డి, అశోక్, రాములు, ప్రభు, గణేశ్, ప్రశాంత్, మహేశ్, సతీశ్, చంటి, నాగరాజు, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పీజేఆర్‌కు ఘన నివాళి
కార్మిక నాయకుడు, దివంగత నేత జనార్దన్‌రెడ్డి జయంతిని చిట్కుల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత నీలం మధు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, సీఎల్పీ నేతగా పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం వివేకనందుడి ఫొటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.