నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకే లాభం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకే లాభం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి, ప్రజలకే లాభం అని తెలిపారు. మంత్రి పదవి మాత్రం ఎప్పుడు వస్తుందనేది చెప్పలేనని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

భువనగిరి ఎంపీ స్థానాన్ని నిద్రాహారాలు మాని గెలిపించా. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుర్చీని ఎవరూ ప్రశ్నించలేరు. జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్ ను ప్రశ్నించడం సరికాదు. అసెంబ్లీలో ఆయన అతిగా ప్రవర్తించారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవమానించినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారు. మేము ఎవరినీ లక్ష్యంగా చేసుకోం.. తప్పు చేస్తే వదిలిపెట్టం’’ అని ఆయన చెప్పారు.