- కడుపు మంట తగ్గేందుకు వాడాలని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే వారికి కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్లను పంపామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ కూడా బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లను పంపాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్ కు కొరియర్ లో తాను ఆ ప్యాకెట్లను పంపానని తెలిపారు. ఈనో తీసుకుంటే అభివృద్ధిని చూసి జీర్ణించుకునే శక్తి పెరుగుతుందని చురకలు అంటించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే గుడ్డలు ఊడదీసి కొడ్తామని హెచ్చరించారు.