
- ఎమ్మెల్సీ కవితపై బల్మూరి వెంకట్, అమేర్ అలీఖాన్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ లెక్కలతో బడ్జెట్ లెక్కలపై కన్ఫ్యూజన్ అవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అమేర్ అలీఖాన్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇద్దరు నేతలు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే కవిత ఉన్నారని తెలిపారు.
గత పదేండ్లుగా ఓడీ లాంటి చేబదలుతో బీఆర్ఎస్ సర్కార్ నడిచిందని, కానీ తమ ప్రభుత్వం మాత్రం వాస్తవ పరిస్థితిని బడ్జెట్ లో చెప్పిందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు కవిత తన తండ్రి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మాట్లాడినట్లుగానే అదే భాషలో కేటీఆర్, హరీశ్కూడా మాట్లాడారని విమర్శించారు. కవిత చేతిలో ఉన్న పింక్ బుక్ లో ఏం రాస్తున్నారని ప్రశ్నించారు.