కేదార్ మృతిపై విచారణ జరిపించాలి : ఎంపీ చామల

కేదార్ మృతిపై విచారణ జరిపించాలి : ఎంపీ చామల
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఇటీవల దుబాయ్​లో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ చామ ల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. సోమవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే హరీశ్​ రావు దుబాయ్​కి పోయిన విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో పెండ్లికి వెళ్లానని బుకాయిస్తున్న హరీశ్.. ఈ నెల 6న పెండ్లి ఉంటే  గత నెల 22నే   దుబాయ్  ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో లూటీ చేసిన పైసలను దుబాయ్​లో దాచుకోవడానికే వెళ్లారని, అదే రోజున దుబాయ్ లో కేదార్ చనిపోయారని ఆరోపించారు. ఎలక్షన్ లు, కలెక్షన్ లు హరీశ్ నినాదమని చామల అన్నారు.