
- ఉప ఎన్నికలు వస్తాయన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఐదేండ్ల వరకు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి ఉండదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తుండని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ తెచ్చేందుకే ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుండని, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలని కేసీఆర్ కు చామల సూచించారు.