- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పద్మశ్రీ అవార్డు అంశాన్ని పార్లమెంటు జీరో అవర్ లో లేవనెత్తుతానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ మాట్లాడిన తీరు సరిగ్గా లేదని, ఆయన ఇప్పుడు కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కేంద్రం బడ్జెట్లో ఇప్పుడైనా తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. బిహార్, ఏపీకి ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పుడైనా లోక్ సభలో విభజన హామీల అమలు కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు మాట్లాడాలని కోరారు.