కేటీఆర్...కాంగ్రెస్ వేర్లను పీకే అంత దమ్ముందా.? : జగ్గారెడ్డి

  • వేళ్లు వెతకడానికే నీ వయస్సు సరిపోతది
  • కేటీఆర్​పై పీసీసీ వర్కింగ్ + ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ.. కల్పవృక్షం లాంటిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మర్రి చెట్టులాంటి మా పార్టీ వేర్లు వెతకడానికే కేటీఆర్ వయస్సు సరిపోతుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్​ను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్న కేటీఆర్ కామెంట్లపై మండిపడ్డారు. గాంధీభవన్​లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్ వేర్లను పీకే అంత దమ్ము నీకు ఉందా? ప్రతిపక్ష పార్టీగానే బీఆర్ఎస్ ఇంకా 20 ఏండ్లు బతుకుతది. అప్పుడే ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎట్ల? కాంగ్రెస్ పార్టీ వయస్సు 140 ఏండ్లు. నీ వయస్సు కేవలం 50 ఏండ్లు. కాంగ్రెస్ ఏజ్​లో నీ వయస్సు పావు వంతు మాత్రమే. అలాంటి పార్టీని.. కూకటివేళ్లతో పెకిలిస్తా అంటావా? నీకున్న శక్తి ఎంత.. నీ వయస్సెంత?’’అని కేటీఆర్​పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.