దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీలేదు: ఖర్గే

దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీలేదు: ఖర్గే

బెంగళూరు: దేశ స్వాతంత్ర్యం కోసం, ఆర్థిక, సామాజిక వృద్ధి కోసం బీజేపీ నేతలు చేసిందేమి లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చింది,  దేశ ఐక్యత కోసం  పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.  రిపబ్లిక్ డే సందర్భంగా కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్  కార్యాలయంలో ఖర్గే జాతీయన జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. ‘‘ఇటీవల పలువురు నేతలు ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా రాజ్యాంగాన్ని అవమానించిన తీరు బాధాకరం. 

రాజ్యాంగ నిర్మాతపై అనుచిత  వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నేను పార్లమెంటులోనే ఉన్నాను. ‘‘ కొంతమంది నేతలకు అంబేద్కర్ పేరును పలకడం ఫ్యాషన్​గా మారిందని, అంబేద్కర్ పేరును జపించినన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే ఈ పాటికి వారికి స్వర్గంలో చోటు దక్కేదని అమిత్​ షా ఎద్దేవా చేశాడు’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ నేతలు దేశ స్వాతంత్ర్యం, ఆర్థిక వృద్ధి కోసం చేసిందేమిలేదన్నారు.