తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని  కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విధుల్లో ఉండగానే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ తన తుపాకితో కాల్చుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన   దూసరి బాలకృష్ణ (28)  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.  గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఉదయం 03:30 గంటలకు విధుల్లో ఉండగానే తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.