సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో తాగునీటి ఎద్దడి

సూర్యాపేట, వెలుగు: రూ. కోట్లు పెట్టి సకల సౌకర్యాలతో నిర్మించిన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో తాగునీటి ఎద్దడి నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నెల రోజులుగా పని చేయకపోవడంతో ఉద్యోగులు, ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

దీంతో ఉద్యోగులే రూ.20 చొప్పున ఖర్చు పెట్టి వాటర్ క్యాన్లు తెప్పించుకుంటున్నారు. వివిధ అవసరాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి వాటర్ కొనాల్సి వస్తోంది.