
కాగజ్‌నగర్, వెలుగు : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు కనీసం 50 గ్రాముల బరువు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా సరఫరాదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోధంపల్లి, గురుడుపేట్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి రెండు రోజుల కింద సరఫరా అయిన గుడ్లు చాలా చిన్న సైజ్‌లో కనిపించాయి. మూడు గుడ్లు కలిపినా కనీసం 50 గ్రాముల బరువు ఉండే అవకాశం లేదు. అరచేతిలో ఏడు గుడ్లు పట్టే అంత చిన్న సైజ్‌లో ఉండడం గమనార్హం. ఆఫీసర్లు స్పందించి పెద్ద సైజ్ గుడ్లు సరఫరా అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.