ఆదిలాబాద్ జిల్లాలో తడిసిపోయిన తెల్ల బంగారం

ఆదిలాబాద్ జిల్లాలో తడిసిపోయిన తెల్ల బంగారం

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట తడిసి ముద్దయింది. దీంతో తడిసిన పత్తిలోని తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు  అవస్థలు పడుతున్నాడు.   మార్కెట్లో మాయిశ్చర్  నిబంధన ఉండడంతో పత్తి పంటలలో తేమ శాతాన్ని తగ్గించేందుకు కల్లాల్లోనూ, ఇంటి ముందు ఆరబెడుతున్నారు. 

బుధవారం నుంచి కాటన్ మార్కెట్ ప్రారంభం కానుందని, రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రావాలంటే  8 నుంచి 12 శాతం మాయిశ్చర్  ఉండేలా  చూసుకోవాలని ఇటీవలే కలెక్టర్ సూచించారు.          

వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్