నాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు

 నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి

నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వరంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పత్తి రైతులు రోడ్డెక్కారు. నకిలీ విత్తనాలతో పంటలు సరిగా పండలేదంటూ కాసేపు రాస్తోరోకో చేశారు.అధికారుల పర్యవేక్షణ లోపంతో డీలర్లు నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో మొక్కలు ఏపుగా పెరిగినా.. కాయ పట్టలేదని వాపోయారు. పెరిగిన 10 మొక్కల్లో  రెండింటికి మాత్రమే కాయలు ఉండడంతో తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.

నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై అధికారులు చర్య తీసుకొని.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు . ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సురేష్ కు వినతిపత్రం అందజేశారు.