కారును ఢీకొట్టిన లారీ.. దంపతులకు గాయాలు

కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు సమీపంలోని కొడిమ్యాల మండలం జేఎన్టీయూ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి కారును ఎదురుగా వస్తున్న ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులకు రెండేళ్ల చిన్నారి కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగాధర మండలం వెంకటయ్య పల్లి గ్రామానికి చెందిన  ఉప్పుగండ్ల గిరి, అతడి భార్య శ్రుతి, రెండేళ్ల చిన్నారి రితన్య జగిత్యాలకు కారులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ జేఎన్టీయూ క్రాసింగ్ వద్ద  ఢీ కొట్టింది.

పోలీసులు ప్రమాదానికి గురైన ముగ్గురిని 108 ద్వారా జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించారు. తల్లి శ్రుతి, చిన్నారి రితన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు.  సంఘటన స్థలంలో ట్రాఫిక్ జాం కావడంతో ఎస్సై సందీప్ తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పునరుద్ధరించారు.