
నాగు పామును చూస్తే మనుషులైనా..జంతువులైనా పారిపోవాల్సిందే. ఎక్కడ కాటేస్తుందో అన్న భయంతో మనుషులు, జంతువులు నాగుపాము దగ్గరకు కూడా రావు. కానీ ఓ ఆవు మాత్రం నాగుపాముతో దోస్తీ చేసింది. ప్రస్తుతం నాగుపాము, ఆవు ఫ్రెండ్షిప్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
17 సెకన్ల వీడియోలో ఆవుకు పాము స్నేహబంధం ఆకట్టుకుంటుంది. ఆవును చూసిన పాము..పడగవిప్పగా..ఆవు కూడా పడగవిప్పిన పామును ప్రేమగా నాలుకతో నిమిరింది. తనకంటే చిన్నదైన పామును ఆవును నాలుకతో లాలించింది. తనకంటే పెద్ద జంతువు ఆవును చూసి నాగుపాము ఎలాంటి భయాన్నివ్యక్తం చేయలేదు. పైగా ఆవుతో పాము చక్కగా కలిసిపోయింది. రెండు కూడా ఎంతో చక్కగా సంభాషించుకున్నాయి.
Difficult to explain. The trust gained through pure love ? pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda (@susantananda3) August 3, 2023
ఆవు, నాగుపాముకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. పామును ఆవు ప్రేమగా లాలించడాన్ని చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు. ఇద్దరి మధ్య ఈ నమ్మకం నిజమైన ప్రేమ అని రాసుకొచ్చారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 7 లక్షల మందికి పైగా వీక్షించారు. 10 వేలకు పైగా లైక్ లు చేశారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.