స్కూలుకు వెళ్తున్న పాపపై ఆవు దాడి..పగబట్టినట్లే..(వీడియో)

పాపపై పగబట్టినట్లు.. ఓ ఆవు విచక్షణ రహితంగా దాడి చేసింది. స్కూల్ కు వెళ్తున్న ఓ పాపను ఆవు వెంటాడి మరి దాడి చేసింది. చుట్టు ప్రక్కల వాళ్లు ఆవును బెదిరించినా పాపను మాత్రం వదల్లేదు. ఆవుతో పాటు..దాని దూడ కూడా పాపపై దాడి చేసింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. 

స్కూలుకు వెళ్తున్న పాప పై ఆవు దాడి చెన్నై వీధుల్లో స్కూలుకు వెళ్తున్న చిన్నారి పై ఒక్కసారిగా ఆవు విరుచుకుపడింది. బెంబేలెత్తిపోయిన తల్లి నిస్సహాయ స్థితిలో ఎం చెయ్యాలో అర్ధంకాక కాపాడే ప్రయత్నం చేయసాగింది. చివరికి స్థానికులు వచ్చి కాపాడారు.

ఏం జరిగిందంటే..

చెన్నైలో   ఓ ముస్లిం పాప తన తల్లితో కలిసి స్కూల్ కు నడుచుకుంటూ వెళ్తోంది. వీధిలో  ఓ వైపు ముస్లిం పాప, తన తల్లి నడుస్తుండగా..మరోవైపు ఆవు, దాని దూడ వెళ్తున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ..ఆవు ఒక్కసారిగా పాపపై దాడి చేసింది. తన కొమ్ముతో పాపను ఎత్తిపడేసింది. కిందపడిన పాపపై ముఖంతో దాడి చేసింది. కాళ్లతో తన్నింది. పాప అరుస్తుండగా..చుట్టు ప్రక్కల వాళ్లు ఆవును వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆవు మరింత రెచ్చిపోయింది. పాపను మాత్రం అస్సలు వదల్లేదు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

  • ALSO READ : పెళ్లి తర్వాత కూతుళ్లు మారిపోతారు : ఇంటర్నెట్ లో ఎమోషనల్ డిస్కషన్.. ఇందులో మీరూ ఉంటారు కచ్చితంగా..

మరో రెండు ఆవులు..

ఓ వైపు ఆవు..దాడి దూడ పాపపై దాడి చేస్తుండగా..మరో రెండు ఆవులు వచ్చాయి. ఆవు దూడ దాడిచేస్తుండగా మిగతా రెండు ఆవులు చూస్తూ ఉండిపోయాయి. పాపపై దాడి చేస్తున్న ఆవును కొందరు రాళ్లతో కొట్టారు. అయితే మరికొందరు మనకెందుకు అనుకుని గేటు లోపలే ఉండిపోయారు. ఇంతలో ఓ వ్యక్తి కర్రతో ఆవును కొట్టడంతో..ఆవు బయపడి పారిపోయింది.