సమన్వయంతో విధులు నిర్వహించాలి : సీపీ అనురాధ

సమన్వయంతో విధులు నిర్వహించాలి :  సీపీ  అనురాధ
  •  సీపీ  అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్​అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ అనురాధ ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట వన్ టౌన్, మహిళా పీఎస్​, టాస్క్ ఫోర్స్ ఆఫీస్, పోలీస్ సబ్సిడరీ క్యాంటీన్ ను సందర్శించారు. పీఎస్​పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూం ను పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.

 ఇసుక, జూదం, పీడీఎస్ రైస్, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై నిఘాపెట్టి గంజాయి రహిత జిల్లా కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీలు మధు, రవీందర్, సీఐలు వాసుదేవరావు, దుర్గ, రమేశ్, జానకి రామ్ రెడ్డి,  శ్రీధర్ గౌడ్, రామకృష్ణ, ఎస్ఐలు నరసింహారావు, నితిన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.