హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారని, ఆయన హైదరాబాద్ వచ్చారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆయన ఏ ఎయిర్ పోర్టులో దిగినా తమకు సమాచారం వస్తుందని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ పై ఫోకస్ పెంచామని చెప్పారు.
అక్టోబర్ 25న జరిపిన తనిఖీల్లో రెండు డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేశామని అన్నారు. హెచ్ న్యూ, పోలీస్ ఆపరేషన్ లో ఆఫ్రికాలోని నైజీరియాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాయని అన్నారు సీవీ ఆనంద్. తనిఖీల్లో హుమాయిన్ నగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే గ్రాముల ఎల్ఎల్డీ గుర్తించామని వెల్లడించా కంచన్ బాగ్ లో 80 గ్రాముల ఎండీఎంఏ, 10 రు. వీటి విలువ మొత్తం రూ.20.75 లక్షలు ఉంటుందని చెప్పారు.
ALSO READ | శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానానికి బాంబు బెదిరింపు కాల్
అయితే బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఏపీ నుంచి గంజాయి రవాణా అవుతోందని తెలిపారు. డ్రగ్స్ సరఫరాలో అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడని అన్నారు. కురాకు బెంగళూరులో ఓ సప్లయిర్ ఉన్నాడని, వాట్సప్ గ్రూప్ ద్వారా ఆర్డర్స్, డ్రగ్స్ సప్లై నడిపిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. హాష్ ఆయిల్ సప్లై చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిని గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశామని, బెయిల్ పై రిలీజ్ అయి మళ్లీ డ్రగ్స్ దందా చేస్తున్నాడని తెలిపారు. డ్రగ్స్ ఎవరు తీ సుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.