
- పీసీసీ చీఫ్‌ను కోరిన సీపీఐ నేతలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు ధర్మంలో భాగంగా తమకు రెండు ఎమ్మెల్సీ పదవులను కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉందని, అందులో ఒకటి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను సీపీఐ నేతలు కోరారు. సోమవారం గాంధీ భవన్‌కు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి..మహేశ్ గౌడ్‌తో భేటీ అయి, ఈ విషయంపై చర్చించారు.
అనంతరం మీడియాతో కూనంనేని మాట్లాడుతూ.. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రెండింటిలో ఒకటి సీపీఐకి ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వలేకపోయారని, ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి, ఆ తర్వాత మరొక ఎమ్మెల్సీ తమకు ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను కోరామన్నారు.