మాకు ఎమ్మెల్సీ సీటివ్వండి.. పీసీసీ చీఫ్ కు సీపీఐ రిక్వెస్ట్

మాకు ఎమ్మెల్సీ సీటివ్వండి.. పీసీసీ చీఫ్ కు సీపీఐ రిక్వెస్ట్

హైదరాబాద్: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో తమకు ఒక సీటు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కోరారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర నేతల బృందం ఇవాళ హైదరాబాద్లోని గాంధీభ వన్ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ను  కలిసి వినతిపత్రం అందజేశారు.

 ఈ సందర్భంగా మాట్లాడిన కూనంనేని  .. ఎన్నికల పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గతంలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానంలో ఇవ్వలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐదు నామినేటెడ్ స్థానాలు నియామక సమయంలో ఇస్తామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఇవ్వా లని కోరుతున్నాం. తర్వాత మరొక ఎమ్మెల్సీ అడుగుతం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ హామీ కోసం కలుస్తాం' అని తెలిపారు.