హెచ్​సీయూ భూములు వేలం వేయొద్దు

హెచ్​సీయూ భూములు వేలం వేయొద్దు

యాదాద్రి, వెలుగు : హెచ్​సీయూ భూములను వేలం వేయొద్దని సీపీఎం, బీజేవైఎం వేర్వేరుగా డిమాండ్ చేశాయి. యూనివర్సిటీ వద్ద నిర్వహించే ధర్నాకు మంగళవారం వెళ్లడానికి ప్రయత్నించిన సీపీఎం, బీజేవైఎం లీడర్లను భువనగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల లీడర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే ధర్నాకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నాయి. 

ఆదాయం కోసం ఆస్తులు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వేలం ప్రక్రియను ఆపేయాలని డిమాండ్​ చేశారు. సీపీఎం లీడర్లు కొండమడుగు నర్సింహ, దయ్యాల నర్సింహ, బీజేవైఎం లీడర్లు పట్నం కపిల్, కానుకుంట్ల రమేశ్, కటకమోజు ఉషా కిరణ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. 

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

నల్గొండ అర్బన్, వెలుగు : సీపీఎం జిల్లా నాయకులను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని సీపీఎం జిల్లా నాయకులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.హైదరాబాద్‌‌లో సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నాయకులను అరెస్ట్​చేయడం సరికాదన్నారు. 

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసినవారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ లైనవారిలో సీపీఎం  జిల్లా కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పుచ్చకాయల నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, నాయకులు కొండా వెంకన్న, బొల్లు రవీందర్, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, సలివోజు సైదాచారి, కన్నెకంటి సత్యనారాయణచారి, కండె యాదగిరి, బండ మహేశ్​ఉన్నారు.