
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: ఇస్లాం మతం స్వీకరించిన బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వీల్లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన బీజేపీకి, అసలు బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బీసీల హక్కులను కాలరాయడంతో పాటు ఇక్కడ కూడా బీసీల పేరుతో ముస్లిం, మైనారిటీల హక్కులను కాలరాసే వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. దూదేకుల, పాకీపని చేసేవారు, రాళ్లు గొట్టి బతికేవారు, ఇతర అనేక రకాలైన వృత్తులవారు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.