25న సంగారెడ్డిలో సీపీఎం భారీ బహిరంగ సభ

సంగారెడ్డి టౌన్, వెలుగు: సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల్లో భాగంగా  25న సంగారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్లో సీపీఎం ప్రతినిధి బృందంతో కలిసి బహిరంగ సభ వాల్ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా పార్టీ జెండా ఆవిష్కరణ   చేస్తున్నట్లు తెలిపారు.

 28 నిర్వహించే భారీ బహిరంగ సభకు సీపీఎం పొలిట్​  బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు,   రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు ,  జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు హాజరవుతున్నారన్నారు. పోస్టర్ ఆవిష్కరణ లో  నాయకులు అడివయ్య,  బి మల్లేశం, మాణిక్యం, సాయిలు, నర్సింలు, కృష్ణ, భూషణం, కొండల్రెడ్డి, సురేశ్​ తదితరులు ఉన్నారు.