
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు : అనుమతి లేని అక్రమ లే అవుట్ల రెగ్యులరైజేషన్ –2020 (ఎల్ఆర్ఎస్) రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు అయి.. మిగిలిన 90 శాతానికి కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. కచ్చితంగా 2020 ఆగస్టు 26 కంటే ముందు కనీసం 10 శాతం ప్లాట్లు అమ్మి ఉండాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజును సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించేలా మార్పులు చేశారు.