రెండున్నరేండ్లకే ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​కు పగుళ్లు

రెండున్నరేండ్లకే ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​కు పగుళ్లు
  • రూ. 55కోట్లతో బీఆర్​ఎస్​ సర్కార్​ నిర్మించిన కలెక్టరేట్​ 
  • గోడలకు చెమ్మ, రాలుతున్న పెయింటింగ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత బీఆర్​ఎస్​ సర్కార్​   నిర్మించిన ఇంటిగ్రేటెడ్​  కలెక్టరేట్​ (ఐడీఓసీ) బిల్డింగ్​ రెండున్నరేండ్లకే పగుళ్లు తేలింది.  పలు చోట్ల గోడలకు చెమ్మ వస్తోంది. పెయింటింగ్​ రాలిపోతొంది. దాదాపు రూ. 55 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్​ బిల్డింగ్​ నిర్మాణంలో లోపాలు  ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. పగుళ్లు, నిమ్ము, రాలుతున్న పెయింటింగ్​ జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి – పాల్వంచ మండలాల మధ్య గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ దాదాపు రూ. 55కోట్లతో ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​   కాంప్లెక్స్​తోపాటు కలెక్టర్​, అడిషనల్​ కలెక్టర్ల క్వార్టర్లను ఆర్​అండ్​బీ శాఖ ఆధ్వర్యంలో   నిర్మించారు. 

2022 జనవరి లో అప్పటి  సీఎం కేసీఆర్​ ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ను ఆర్భాటంగా ప్రారంభించారు. నిర్మాణం జరుగుతున్న టైంలో బిల్డింగ్​ను పరిశీలించిన అప్పటి కలెక్టర్​ అనుదీప్​ నాసిరకం పనులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించినా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం వల్లే  పగుళ్లు వస్తున్నాయి. 

 ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో కురుస్తున్న వానలతో బిల్డింగ్​ నిర్మాణం డొల్ల తనం బయట పడుతోంది. గ్రౌండ్​ ఫ్లోర్​లోని పైకప్పుకు భారీగా పగుళ్లు కనిపిస్తున్నాయి. కలెక్టర్​ ఆఫీస్​ సమీపంలోని కాంపౌండ్​ వాల్​కు పగుళ్లు ఏర్పడ్డాయి. పలు చోట్ల గోడలకు చెమ్మ వస్తోంది. పెయింటింగ్​ కూడా రాలిపోతుంది.   ​స్లాబ్​ల మధ్య సరైన   జాయింట్​ చేయకపోవడంతో  వానపడితే పై కప్పు నుంచి కురుస్తుంది.    పై నుంచి వాననీరు పడుతుండటంతో  ఆఫీసర్లతో పాటు కలెక్టరేట్​కు వచ్చే ప్రజలు  ఇబ్బందులు పడ్తున్నారు. 

పరిశీలించి చర్యలు చేపడతాం.. 

కలెక్టరేట్​కు వచ్చిన పగుళ్లను పరిశీలిస్తాం. కొన్ని చోట్ల సరైన సెటింగ్​ కాకపోతే ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారీస్​ పెచ్చులు ఊడే అవకాశాలున్నాయి. పగుళ్ల తీరును పరిశీలిస్తాం. గోడలకు చెమ్మ రావడం, స్లాబ్​ ల మధ్య జాయింట్​ నుంచి వాన నీరు లీకేజీలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. 

నాగేశ్వరరావు,  ఆర్​అండ్​బీ డీఈ, భద్రాద్రికొత్తగూడెం