పంట మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలి: కోదండ రెడ్డి

 పంట మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలి: కోదండ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి విమర్శించారు. రైతు కుటుంబ సభ్యుల శ్రమ ఖర్చులను కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఐదో వార్షికోత్సవ సభ జరిగింది. కార్యక్రమానికి కోదండ రెడ్డి, జస్టిస్ బి చంద్రకుమార్, సైంటిస్ట్ బాబురావు, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, షుగర్ బేగం హాజరయ్యారు.

 ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చెక్కులను అందజేశారు. అశాస్త్రీయ పారిశ్రామిక విధానాలతో గాలి, నీరు కలుషితం అవుతున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర దొరకడం లేదననారు. రైతులకు మద్దతు ధర లభించే అంతవరకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.