
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. చల్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.