మొబైల్ లో సిస్టమ్ అప్ డేట్ యాప్ ఇన్ స్టాల్ చేస్తే డేంజరే

మొబైల్ లో సిస్టమ్ అప్ డేట్ యాప్ ఇన్ స్టాల్ చేస్తే డేంజరే

సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో సిస్టమ్ అప్ డేట్ అనే ఫీచర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) కు సంబంధించిన అప్ డేట్స్ వచ్చినప్పుడు యూజర్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే హ్యాకర్లు సరిగ్గా 'సిస్టమ్ అప్ డేట్' అనే పేరుతో ఓ మాల్వేర్ యాప్ ను తయారు చేశారని.. ఒక్కసారి ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే యూజర్లు తమ ఫోన్లపై కంట్రోల్ కోల్పోతారని జింపీరియం అనే సైబర్ భద్రత సంస్థ తెలిపింది.

యూజర్లను సులభంగా మోసం వేయడానికి హ్యాకర్లు ఎంతో తెలివిగా దీనికి సిస్టమ్ అప్ డేట్ అని పేరు పెట్టారని.. ఇది యూజర్ల డేటాను చోరీ చేస్తుందని జింపీరియం వివరించింది. మాల్వేర్ ఒక్కసారి ఫోన్ లోకి ఎంటరైతే ఎక్కడి నుంచైనా మీ ఫోన్ ను హ్యాకర్లు తమ కంట్రోల్ లోకి తెచ్చుకోగలరని తెలిపింది. దీని పేరు కారణంగా ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్ డేట్ అనుకుని యూజర్లు సులభంగా మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.

సాధ్యమైనంత వరకు థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని జింపీరియం సీఈఓ శ్రీధర్ మిట్టల్ సూచించారు. OS కు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఫోన్ లోని అప్ డేట్స్ సెక్షన్ లోనే ఉంటాయని, ప్రత్యేకంగా దాని కోసం యాప్ అవసరం లేదని తెలిపారు.