గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని 20 మంది ఎస్సైలను, 7 మంది ఇన్స్పెక్టర్లను సీపీ అవినాష్‌మహంతి బుధవారం బదిలీ చేశారు. మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వెంటనే మల్టీజోన్–2 ఐజీ ఎదుట రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్న రాజశేఖర్‌రెడ్డిని కేపీహెచ్‌బీ పీఎస్‌కు, గచ్చిబౌలి డీఐగా ఉన్న రాజేశ్‌ను కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా, రాజేంద్రనగర్జోన్ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఉన్న సురేశ్‌ను గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు.
అలాగే కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న కొత్తపల్లి ముత్తును రాజేంద్రనగర్ జోన్ఎస్బీ ఇన్స్పెక్టర్గా, కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్గా ఉన్న వెంకటేశ్వరరావును సైబరాబాద్సీటీసీకి ట్రాన్స్ఫర్చేశారు. సీటీసీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కె.భాస్కర్, బాలానగర్ట్రాఫిక్ఇన్స్పెక్టర్ఎన్.సురేశ్‌ను హైదరాబాద్మల్టీజోన్–2కు ట్రాన్స్ఫర్ అయ్యారు. మల్టీజోన్2కు ట్రాన్స్ఫర్ అయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఐజీకి రిపోర్టు చేయాలని సీపీ స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్, లా అండ్ఆర్డర్, సీసీఎస్ పోలీస్ స్టేషన్ల పనిచేస్తున్న 20 మంది ఎస్సైలు ట్రాన్స్ఫర్అయ్యారు.