
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో శనివారం సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అన్నీ జోన్లలో ఐసోలేటెడ్ ప్రదేశాలు, ఫాంహౌజ్‌లు, పబ్బులు, హుక్కా సెంటర్లలో రైడ్లు చేశారు. ప్రధాన రహదారులలో వెహికిల్ చెకింగ్, గంజా టెస్టింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 510 ప్రదేశాల్లో ఈ రైడ్లు చేసి కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
ఇందులో 14 గంజాయి పాజిటీవ్ కేసులు, నిబంధనలు పాటించని పబ్బులపై రెండు కేసులు, ఫాం హౌజ్‌పై ఒక కేసు, వ్యభిచారణ నిర్వహణపై 26 కేసులు, ఒక గేమింగ్ కేసు, 57 న్యూసెన్స్ కేసులు, రెండు ఎన్డీపీసీ కేసులు, ఆరు ఎక్సైజ్ యాక్ట్ కేసులు, నాలుగు వాహనాల సీజింగ్ కేసులు, రెండు ట్రిపుల్ రైడింగ్ కేసులు, 18 అక్రమ నెంబర్ ప్లేట్ కేసులు, ఒక పేకాట కేసు, ఒక పిటా చట్టం కేసు,15 బహిరంగ మద్యపానం కేసులు నమోదు చేశారు.