
హైదరాబాద్ సిటీ నడిబొడ్డు.. అమీర్ పేట్ సెంటర్.. నిత్యం రద్దీగా ఉంటుంది. పగలూ రాత్రీ తేడా లేకుండా జనం తిరుగుతూనే ఉంటారు.. తింటూనే ఉంటారు. అలాంటి ఏరియాలో ఉన్న ఓ కేఫ్ అండ్ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి బేకరీలోని వస్తువులే కాదు.. అందులో పని చేసే నలుగురు కార్మికులు రోడ్డుపై ఎగిరి పడ్డారు. వాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
మార్చి 24న ఉదయం 5 గంటలకు క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్ లో ఈ ఘటన జరిగింది. కేఫ్ లో పనిచేసే ఐదుగురు వంట మనుషులకు తీవ్ర గాయాలయ్యాయి. కేఫ్ లో కస్టమర్స్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read : హైదరాబాద్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
సిలిండర్ పేలుడు ధాటికి బేకరీ గోడ కూలి పక్కనే ఉన్న మరో హోటల్ గోడ కూలింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్డుపై ఘటన జరగడంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.