బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరు చూపిస్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
" సంక్రాంతి రాజు అద్భుతంగా అదరగొడుతున్నాడు.. రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసి బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాడు" అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.సెకండ్ డే రూ.74 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
The King of Sankranthi Delivers Big 🔥#DaakuMaharaaj clocks 𝟗𝟐 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬 - Ruling the box office and hearts alike! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025
A PERFECT SANKRANTHI treat packed with high octane action and heartwarming family emotions! ❤️… pic.twitter.com/duMQ4H4zm6
ఇకపోతే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది. రూ.82 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
ALSO READ | OTT Thriller: ఓటీటీకి తమిళ లేటెస్ట్ హైపర్‌లింక్ థ్రిల్లర్ మూవీ.. నాలుగు కథలతో అదిరిపోయే ట్విస్ట్‌లు
ఇప్పటికే 50 శాతానికి పైగా బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇక వంద కోట్ల మార్కుకు డాకు మహారాజ్ అడుగుదూరంలో ఉన్నాడు.