వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతోంది. వ్యాయామం అంతేకాదు.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా చెబుతున్నారు. రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల ఆలోచనా శక్తి మెరుగుపడుతుందట.
వ్యాయామంచేయనివాళ్లు చేసినవాళ్ల అభిప్రాయాలను తీసుకొని మరీ చెప్పారు. వ్యాయామం చేసినవాళ్లు చురుగ్గా ఉండటంతోపాటు. ఆలోచన తీరు బాగుందట. వ్యాయామం చేయనివాళ్లలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని తేలింది. రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల మతిమరుపు తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టవు. మెదడు పనితీరు బాగుంటుంది. కేవలం ఆలోచన శక్తి పెరగడమే కాదు..
Also Read : మీ ఊపిరితిత్తులు బాగుండాలంటే
నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది వ్యాయామం. ప్రశాంతమైన జీవనంతోపాటు ఆయుష్షును పెంచుతుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ కు సమయం లేకుంటే యోగా కూడా చేయొచ్చు. ముఖ్యంగా మెడిటేషన్ వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసేవాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు .
–వెలుగు, లైఫ్–