రాష్ట్రంలో దళిత బంధు పథకం పక్క దారి పడుతుంది. ఎమ్మెల్యేలే తమ కుటుంబ సభ్యులకు దళిత బంధు స్కీం వర్తింప చేస్తున్నారు. లబ్దదారుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే ఎమ్మెల్యేలే దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేస్తుండటంతో ..TRS కార్యకర్తలకే మేలు జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్దిదారుల జాబితాలో స్టేషన్ ఘన్ పూర్ TRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడి సురేశ్ పేరు ఉంది. సురేష్ ఘన్ పూర్ సర్పంచ్ గా పనిచేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఇక మరికొందరూ ZPTC, MPTC, సర్పంచ్ లు. సింగిల్ విండో చైర్మన్లును దళితబంధు జాబితాలో ఎంపిక చేస్తున్నారు. రఘునాథపల్లి ZPTC అజయ్ కుమార్ పేర్లు కూడా లిస్టులో ఉంది. ఎమ్మెల్యేల ఒత్తిడితో అర్హూలను పక్కనపెట్టి.. ప్రజాప్రతినిధుల బంధు మిత్రులకే కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.