30 ఏండ్ల ఉద్యమానికి ఈ రోజు పరిష్కారం దొరికిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన.. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. సామాజిక న్యాయం అంబేద్కర్ కల అని చెప్పారు. ఇది మా ఏండ్ల నాటి కల అని అన్నారు. దేశంలో ఎస్సీలను ఏనాడు మనుషులుగా చూడలేదన్నారు. ఓ దళితున్ని పార్టీ అధ్యక్షుడిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే అని కొనియాడారు.
Also Read : నా కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే
అంతకు ముందు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్... వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కమిషన్ కు ప్రజలు 4750 ఆర్జీలు ఇచ్చారని చెప్పారు. 59 కులాల ఆర్థిక, రాజకీయ అంశాలపై కమిషన్ ఆరాతీసిందన్నారు. 82 రోజుల్లోనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు సీఎం రేవంత్.