ఆరు గ్యారెంటీ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లాలి : కూచాడి శ్రీహరి రావు

నిర్మల్, వెలుగు : కాంగ్రెస్ ‌‌‌‌ ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సారంగాపూర్ మండలం సాయినగర్ తండా, నిర్మల్ రూరల్ మండలం అనంతపేట, నర్సాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ‌‌‌‌ మేనిఫెస్టోకు అదనంగా కాంగ్రెస్ ‌‌‌‌ అమలు చేయబోయే ఆరు పథకాలను సోనియా గాంధీ ప్రకటించారన్నారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పేరుతో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెరిగిన బడ్జెట్ ‌‌‌‌ కు అనుగుణంగా రూ.4 వేల పెన్షన్ ‌‌‌‌ ఇస్తామని ప్రతినెలా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ‌‌‌‌ను అందిస్తామని తెలిపారు.