ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం.. బెడ్ రూంలోని వస్తువులు ధ్వంసం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని ఓ ఇంట్లోకి ధాన్యం లోడుతో ఉన్న డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. మూల మలుపు దగ్గర అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఇంటిని ఢికొట్టి బెడ్ రూంలోపలికి చొచ్చుకొని వెళ్లింది. దీంతో ఇంటి గోడ కూలి.. బెడ్ రూంలో ఉన్న వస్తువులు ధ్వంసం అయ్యాయి.

డీసీఎం దూసుకెళ్లిన సమయంలో బెడ్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ ముందుభాగం పూర్తిగా ధ్వసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.