
ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL-2025 ఫైనల్ వెరీ గ్రాండ్ గా మొదలైంది. ఇవాళ (మార్చి 15) ఫైనల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన బౌలింగ్ ఫీల్డింగ్ తో ముంబై ఇండియన్స్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.
టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రెండు టీమ్స్ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలి మూడు ఓవర్లు.. అది కూడా పవర్ ప్లే లో ముంబైని కట్టడి చేసింది ఢిల్లీ. మూడో ఓవర్లో ఓపెనర్ హేలీ మాథ్యూస్ ను వెనక్కు పంపింది మరిజెన్ కప్ప్. అద్భుమైన ఇన్ స్వింగ్ తో వికెట్ తీసి ముంబైకి షాకి చ్చింది.
ఇక నాలుగో ఓవర్ లో మరో ఓపెనర్ కూడా కప్ప్ బౌలింగ్ లోనే ఔట్ కావడంతో ఢిల్లీ టీమ్ లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఓపెనర్ యాస్టిక భాటియా ఔట్ అవడంతో డిఫెన్స్ లో పడింది ముంబై. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో రన్స్ పై కాకుండా వికెట్ ను కాపాడుకునేలా ఆడుతున్నారు. ఇద్దరూ ఓపెనర్లను ఔట్ చేసి ముంబైకి కోలుకోలేని దెబ్బ కొట్టింది కప్ప్.
Also Read:-బోరున ఏడ్చిన రోహిత్.. అందుకేనా..?
భారీ పార్ట్నర్ షిప్ ఏర్పడితే తప్ప ముంబై భారీ స్కోర్ కొట్టే పరిస్థితి లేదు. వికెట్లు తీసిన ఉత్సాహంలో మరింత దూకుడు పెంచింది ఢిల్లీ. ఆరు ఓవర్లకు ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. చూడాలి మరి మ్యాచ్ ఎలా టర్న్ అవుతుందో.